కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం గోవింద నామస్మరణతో మార్మోగింది. ఏడు శనివారాల నోము నోచుకునే భక్తులు రాష్ట్ర నలుమూలల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవాదాయశాఖ అన్ని ఏర్పాట్లను చేసింది.
ఇవి చూడండి...