తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో మహిళ మెడల్లో నగలు అపహరిస్తున్న ఇద్దరు దొంగల్ని పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 31లక్షల రూపాయలపైగా విలువైన 610 బంగారు ఆభరణాలు, రెండు బైకుల్ని స్వాధీనం చేసుకున్నారు. అమలాపురం ప్రాంతానికి చెందిన ఈతకోట శ్రీనుబాబు, మల్లవరపు దుర్గా ప్రసాద్‌లు గొలుసులు, బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీరిపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు వారిని పట్టుకున్నారు. వీరిద్దరు 19 కేసుల్లో నిందితులని ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ కాకినాడలో తెలిపారు.
కొవిడ్‌తో ఇప్పటికే కొందరు మావోయిస్టులు చనిపోయారని.. మరికొందరు వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. లొంగిపోతే వైద్యంతోపాటు పునరావాసం కల్పిస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి.