తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని రహదారిపై 200 ట్రాక్టర్లతో యాజమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం ఇటీవల జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం.. నాలుగు చక్రాలు కలిగిన వాహనదారుల తెల్లరేషన్ కార్డును రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో సుమారు 5 వేల కుటుంబాలు ప్రభుత్వం ఇచ్చే నిత్యావసరాలకు దూరమవుతున్నారు. అప్పుచేసి తెచ్చిన సొమ్ముతో ట్రాక్టర్లను కోనుగోలు చేశామని... విలాసవంతమైన కార్లు కొనుక్కో లేదని యాజమానులు వాపోతున్నారు. ఆదాయం కన్నా అప్పులు ఎక్కువగా ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రద్దు చేసిన రేషన్ కార్డులు తిరిగి ఇవ్వాలంటూ నినాదాలు చేశారు.
ఇదీ చదవండీ :బడ్జెట్ 2019: నవ భారతం X అంకెల గారడీ