తూర్పుగోదావరి జిల్లా మండపేట పట్టణంలో సామాజిక దూరానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ వ్యాపారులు దుకాణాలు తెరుచుకోవచ్చని మండపేట మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ నుంచి తమకు ఉత్తర్వులు అందాయన్నారు. సినిమా థియేటర్లు, జిమ్ లు, ఆధ్యాత్మిక కేంద్రాలకు అనుమతి లేదన్నారు. ప్రతి షాప్ వద్ద నిర్వాహకులు శానీటైజర్లు వాడాలని, దుకాణాల వద్ద ప్రజలు గుమిగూడొద్దని సూచించారు. అవసరం మేరకే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలని హితవు పలికారు. అధికారుల ఆదేశాల మేరకు వ్యాపారులు దుకాణాలు తెరిచారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో లాక్డౌన్ అమలుకు కొత్త మార్గదర్శకాలివే..!