తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏపీ రెవెన్యూ ఐకాస, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గ్రామ రెవెన్యూ సహాయకులను.. గ్రామ రెవెన్యూ అధికారులుగా పదోన్నతులు కల్పించినందుకు హర్షం వ్యక్తం చేశారు.
2008లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రెవెన్యూ సహాయకులకు, వీఆర్‌ఓలకు పదోన్నతులు కల్పిస్తే.. ఇప్పుడు ఆయన కుమారుడి హయాంలో మళ్లీ ఆ అవకాశం కల్పించారని అన్నారు.
ఇది చదవండి తూర్పు గోదావరి జిల్లాలో వైరస్ ఉద్ధృతి.. ఒక్క రోజులోనే 117 కేసులు!