తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని పుదుచ్చేరి ఆరోగ్యమంత్రి మల్లాడి కృష్ణారావు దర్శించుకున్నారు. జనవరి 6 తర్వాత యానాం రాజకీయాలకు పూర్తిగా స్వస్తి చెప్తానని ఆయన తెలిపారు. దైవ కార్యక్రమాలు, యానాం, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయాలని భావిస్తున్నానని అన్నారు. ఆరు సార్లు యానాం ఎమ్మెల్యేగా, మూడు సార్లు మంత్రిగా, మూడు సార్లు ఉత్తమ శాసనసభ్యునిగా సేవలందిచానానన్నారు. 25 ఏళ్లు ఎమ్మెల్యేగా చేశానని... రజతోత్సవం తర్వాత రాజకీయాలకు స్వస్తి పలకాలని భావిస్తున్నానన్నారు.
ఇదీ చూడండి. పాడేరు ఘాట్ రోడ్లో అమ్మవారి విగ్రహం ధ్వంసం