ETV Bharat / state

యానాంలో పుదుచ్చేరి సీఎం పర్యటన.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన - యానాంలో పుదుచ్చేరి సీఎం

పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి ... తూర్పుగోదావరి జిల్లా యానాంలో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. రెండ్రోజుల పాటు నారాయణస్వామి పర్యటన కొనసాగనుంది.

puducherry cm narayana swamy tours yanam
యానాంలో పుదుచ్చేరి సీఎం పర్యటన
author img

By

Published : Jan 6, 2020, 6:54 PM IST

యానాంలో పుదుచ్చేరి సీఎం పర్యటన
పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి... యానాంలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా యానాం చేరుకున్న నారాయణస్వామి... పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. యానాం కనకాల పేటలో రూ.21 కోట్ల వ్యయంతో నిర్మించిన ఫ్రెంచ్, అడవిపాలెం కాల్వల అనుసంధాన పథకం, యానాంలో రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించిన డిగ్రీ కళాశాల నూతన భవనాన్ని ప్రారంభించారు. దెయ్యాలతిప్పలో రూ. 25 కోట్లతో అభివృద్ధి చేసిన మడ అడవుల సందర్శన కేంద్రాన్ని, గిరిపేటలో.. అత్యవసర సమయాల్లో వైద్య సదుపాయాలు అందించేందుకు అంబులెన్స్​ను ఆయన ప్రారంభించారు. పుదుచ్చేరిలోని జిప్​మర్​​ ఆసుపత్రికి అనుసంధానంగా యానాంలో నిర్మించే భవనానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు, యానాం డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా, అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

యానాంలో పర్యటించనున్న పుదుచ్చేరి ముఖ్యమంత్రి

Intro:ap_rjy_37_06_cm_inagarurations_av_ap10019 తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం సెంటర్

Body:పుదుఛ్ఛేరి ముఖ్యమంత్రి యానం పర్యటన

Conclusion: రెండు రోజుల పర్యటన నిమిత్తం తూర్పుగోదావరి జిల్లా యానం చేరుకున్న పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం శంకుస్థాపనలు చేశారు.. కనకాల పేట లో 21 కోట్ల వ్యయంతో నిర్మించిన లిఫ్ట్ ఇరిగేషన్... యానాం లో 3 కోట్లతో నిర్మించిన డిగ్రీ కళాశాల నూతన భవనాన్ని.. దెయ్యాలతిప్ప లో 25 కోట్లతో అభివృద్ధి చేసిన పర్యాటక మడ అడవుల సందర్శన కేంద్రాన్ని.. గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర సమయాల్లో అత్యాధునిక వైద్య సదుపాయాలు కలిగిన అంబులెన్స్ను గిరింపేట లో ప్రారంభించి... దేశంలోనే అత్యున్నత వైద్య సేవలు అందించే పుదుచ్చేరిలోని జిప్మెర్ అనుసంధానంగా నూతనంగా నిర్మించే భవనానికి భూమి పూజ చేశారు.. ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు యానం డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా ప్రజా పనుల శాఖ అధికారులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.