తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పాత భవనంలో మందులు ఇలా కింద పడి ఎవరి పట్టింపు లేని పరిస్థితుల్లో దర్శనమిస్తున్నాయి. ఈ పాత భవనంలో 104 వైద్య సేవలకు సంబంధించిన మందులు భద్రపరుస్తున్నారు. అయితే బూజుపట్టిన గదిలో ప్రజలకు ఉపయోగించే మందులను నిర్లక్ష్యంగా పడేసిన తీరు ఆందోళన కలిగిస్తుంది. వీటిలో కాలం చెల్లినవి ఉన్నాయి. ఓవైపు కరోనా వైరస్ నివారణకు పరిశుభ్రత పాటించాలని వైద్యాధికారులు ప్రజలకు పదేపదే చెబుతున్నా.... ఇక్కడ మాత్రం మందులను భద్రపరచుకునే తీరులో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తుండడంపై.. ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇదీ చూడండి: