తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ దర్శించుకున్నారు. దిండి నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులతో భారీ ర్యాలీగా అంతర్వేది చేరుకున్న జనసేనానికి... ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పవన్... స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పండితుల వద్ద వేదాశీర్వచనం పొంది తీర్థప్రసాదాలు స్వీకరించారు. అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లిన పవన్‌కు.. మార్గ మధ్యలో మహిళా అభిమానులు, కార్యకర్తలు హారతులు పట్టారు.
ఇదీ చదవండి