కరోనా ఉద్ధృతి పెరుగుతున్న కారణంగా.. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పట్టణంలో సంపూర్ణ పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సభ్యులు కోరారు. మున్సిపల్ చైర్ పర్సన్ సత్యనాగేంద్రమణి అధ్యక్షతన సమావేశం జరిగింది. వైకాపా ఓడిన వార్డులలో.. ప్రతిపక్ష సభ్యులకు సరైన గౌరవం ఇవ్వకుండా అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని.. జనసేన, తెలుగుదేశం అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: సంగం డెయిరీ యాజమాన్యం బదిలీ.. ప్రభుత్వ ఉత్తర్వులు