ఇదీ చదవండి
'నియోజకవర్గాన్ని ఎన్నడూ లేనంతగా అభివృద్ధి చేశా'
రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశానని తెదేపా అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ఓట్లను అభ్యర్థించారు.
తెదేపా అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ తెదేపా అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ...ఓట్లను అభ్యర్థిస్తున్నారు. గ్రామీణ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశానని తెలిపారు. తెదేపా అధికారంలోకి వస్తేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. వైకాపా నాయకులు ప్రజలను మభ్య పెట్టే విధంగా ప్రచారం చేస్తున్నారని... అయినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు .
ఇదీ చదవండి
sample description