తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం అంతర్వేది పల్లిపాలెం ఫిషింగ్ హార్బర్ వద్ద నెమలి కోణం చేప అబ్బురపరిచింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మత్స్యకారుల వలకు చిక్కిన ఈ చేపను అంతర్వేది పల్లి పాలెం ఫిషింగ్ హార్బర్ కు తీసుకు వచ్చారు. అచ్చం నెమలిలా పోలి ఉన్న ఈ చాప వెన్నుపై పింఛం ఉంది. ఇది సముద్రంలో పురివిప్పి తిరుగుతుందని స్థానిక మత్స్యకారులు తెలిపారు. దీనిని స్థానిక వ్యాపారస్తుడు మూడు వేల రూపాయలకు కొనుగోలు చేశాడు.
ఇదీ చూడండి