గోదావరి నదిలో గత నెల ప్రమాదానికి గురైన రాయల్ వశిష్ఠ బోటును వెలికితీయడంలో... విశాఖకు చెందిన ఓం శ్రీ శివశక్తి సంస్థకు చెందిన డైవర్లు 3 రోజులుగా పడిన కష్టానికి ఫలితం దక్కింది. నది లోపలికి వెళ్లి బోటును పరిశీలించి.. కచ్చితమైన అంచనాకు వచ్చాక.. బయటకు తీయడానికి తగిన ప్రణాళిక రూపొందించారు. ధర్మాడి సత్యం బృందం ఆధ్వర్యంలో విజయవంతంగా బోటును ఒడ్డుకు చేర్చారు. మరిన్ని వివరాలపై... డైవర్లతో మా ప్రతినిధి ముఖాముఖి.