ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ప్రభుత్వం సస్పెండ్ చేయడాన్ని మాజీ ఉప ముఖ్యమంత్రి, తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప తప్పుబట్టారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో చీఫ్ ఇంటెలిజెన్స్ అధికారిగా పని చేసిన ఆయనపై ప్రభుత్వం కావాలనే చర్యలు తీసుకుందని తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో అన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా.. కక్షసాధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం 170 మంది పోలీసు అధికారులు వీఆర్లో ఉన్నారని.. వారికి పోస్టింగ్ ఇవ్వకుండానే పని చేయించుకుంటున్నారని చినరాజప్ప విమర్శించారు.
ఉద్యోగులపై సీఎం పంజా విసురుతున్నారు: చినరాజప్ప - ప్రభుత్వంపై చిన్నరాజప్ప విమర్శలు
సీఎం జగన్ తనకు ఇష్టం ఉన్న వారికి పోస్టింగ్ ఇస్తూ.. ఇష్టం లేని వారిని సస్పెండ్ చేస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ప్రభుత్వం సస్పెండ్ చేయడాన్ని మాజీ ఉప ముఖ్యమంత్రి, తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప తప్పుబట్టారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో చీఫ్ ఇంటెలిజెన్స్ అధికారిగా పని చేసిన ఆయనపై ప్రభుత్వం కావాలనే చర్యలు తీసుకుందని తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో అన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా.. కక్షసాధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం 170 మంది పోలీసు అధికారులు వీఆర్లో ఉన్నారని.. వారికి పోస్టింగ్ ఇవ్వకుండానే పని చేయించుకుంటున్నారని చినరాజప్ప విమర్శించారు.
ఇదీ చదవండి:
'రిజర్వేషన్లు లేని ప్రాంతాల్లో స్థానిక ఎన్నికలు బహిష్కరిస్తాం'