తూర్పు గోదావరి జిల్లా మోతుగూడెం సమీపంలో సుఖ మామిడి బ్రిడ్జి వద్ద రూ.3.75 లక్షల విలువచేసే 125 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. డొంకరాయి - లక్కవరం మార్గమధ్యలో వాహన తనిఖీలు చేస్తున్న పోలీసు సిబ్బంది గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి ఇన్నోవా కారు సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సుబ్బారావు తెలిపారు.
ఇదీ చూడండి