మెకానిక్ షెడ్లో ఉన్న మారుతీ 800 కారును కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అపహరించిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో చోటుచేసుకుంది. జాతీయ రహదారి సమీపంలో వెంకటరమణ అనే వ్యక్తి షెడ్డును నిర్వహిస్తున్నాడు. యాండ్ర శ్రీనివాస్ అనే వ్యక్తికి చెందిన మారుతి 800 కారు మరమ్మతుల నిమిత్తం వారం కిందట మెకానిక్ షెడ్డుకు తీసుకొచ్చారు. మరమ్మతులు పూర్తి చేసిన వెంకటరమణ... శుక్రవారం రాత్రి షెడ్డుకు తాళం వేసి ఇంటికి వెళ్ళాడు. ఉదయం వచ్చి చూసేసరికి షెడ్ షట్టర్ తాళాలు పగలగొట్టి ఉన్నాయి. అనుమానం వచ్చి లోపల చూడగా షెడ్లో ఉండాల్సిన కారు కనిపించలేదు. కారు అపహరణకు గురైందని గమనించిన వెంకటరమణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రావులపాలెంలో అపహరణకు గురైన కారు
మెకానిక్ షెడ్లో కారు అపహరణకు గురైన ఘటన తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో చోటుచేసుకుంది. మరమ్మతుల నిమిత్తం మారుతీ 800 కారును మెకానిక్ షెడ్డుకు ఇవ్వగా...అక్కడ అపహరణకు గురైంది.