తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో సత్యగిరిపై హరిహర సదన్ వసతి సముదాయంలో క్వారంటైన్ కేంద్రం నుంచి పలువురిని వారి స్వస్థలాలకు తరలించారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన విద్యార్థులు, ఉద్యోగులు హైదరాబాద్, బెంగుళూరు నుంచి రావటంతో వీరిని అన్నవరం క్వారంటైన్ కేంద్రంలో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో సుమారు 100 మందిని ప్రత్యేక బస్సుల్లో భద్రతతో ఇళ్లకు తరలించారు. అక్కడ అధికారులు వీరిని మరోసారి పరీక్షించే అవకాశం ఉంది. ఇంకా అన్నవరం క్వారంటైన్ కేంద్రంలో 80 మందికి పైగా ఉన్నారు.
ఇదీ చదవండి: ఇంట్లో గది లేక చెట్టుపై క్వారెంటైన్ కేంద్రం!