చిత్తూరు జిల్లా పుత్తూరు సబ్ కోర్టు ఆవరణలో ఈరోజు వర్చువల్ లోక్ అదాలత్ నిర్వహించారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సూచనల మేరకు ఈ కార్యక్రమం ప్రారంభించామని సీనియర్ సివిల్ జడ్జి మురళీధర్ తెలిపారు. కరోనా వ్యాప్తి ధాటికి 7 నెలలుగా వివిధ కేసులు విచారణ జరగక పెండింగ్లో ఉన్నాయని న్యాయమూర్తి పేర్కొన్నారు.
రాజీ కుదుర్చుకునేందుకు మొగ్గుచూపుతున్న కక్షిదారులతో మాట్లాడి వివాదాలను పరిష్కరించాలని సుప్రీం కోర్టు ఆదేశించిందని తెలిపారు. దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని.. ఈ అవకాశాన్ని ఆసక్తి కలిగిన వారులు వినియోగించుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: