Nara Lokesh 'Yuvagalam' Padayatra Updates: చిత్తూరు జిల్లాలో 'యువగళం' పాదయాత్రకు ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారు. వారి ఆత్మీయ ఆహ్వానాన్ని స్వీకరిస్తూ.. బాధితుల గోడు వింటూ నారా లోకేశ్ ముందుకు సాగుతున్నారు. బీడీ కార్మికులు, లాయర్లు, మహిళలతో పాటు.. వివిధ వర్గాలతో ఆయన సమావేశమయ్యారు. అందరికీ అండగా ఉంటామని అభయమిస్తూ.. అధికారంలోకి రాగానే చేపట్టే కార్యక్రమాల్ని వివరించారు.
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పాదయాత్ర ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో జోరుగా సాగింది. దారిపొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ.. వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుగా సాగారు. 11వ రోజు పాదయాత్రను మంగసముద్రం నుంచి ప్రారంభించిన యువనేత.. బీడీ కార్మికులతో సమావేమయ్యారు. చంద్రన్న బీమా పథకాన్ని వర్తింపజేసి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎంత కష్టపడినా.. తమకు కనీస వేతనాలు అమలుకావడం లేదని కార్మికులు వాపోయారు. చిత్తూరు కోర్టు కూడలిలో లాయర్లతో ముఖాముఖి నిర్వహించిన లోకేశ్.. తర్వాత అంబేడ్కర్ కూడలి వద్ద ముస్లిం పెద్దలతో సమావేమయ్యారు. అమరరాజా ప్రాంగణంలో స్థానిక మహిళలతో ముచ్చటించిన లోకేశ్.. వారి సమస్యలను తెలుసుకున్నారు.
గతంలో 27 సంక్షేమ కార్యక్రమాలు ఎస్సీ సోదరులకు వర్తించేవి. ఎందుకు ఇప్పుడు ఆ 27 సంక్షేమ కార్యక్రమాలను చంపేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్సా చాలా వింతగా ఉన్నాయి. అమ్మఒడి పేరుతో సీఎం జగన్.. దళితులకు ఇవ్వాల్సిన నిధులను రాసేసుకున్నారు. తరతరాలుగా ఎస్సీ సోదరులకు వస్తున్న పింఛన్లు కూడా అందులో రాసేసుకున్నాడు. -నారా లోకేశ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
తెలుగుదేశం కార్యాలయం వద్ద ఎస్సీ వర్గాలతో లోకేశ్ భేటీ అయ్యారు. వైసీపీ హయాంలో తమకు అన్యాయం జరిగిందని.. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లించారని ఎస్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి సమస్యలు విన్న లోకేశ్.. టీడీపీ పాలనలో ఎస్సీలకు అందించిన పథకాలు, రక్షణ గురించి వివరించారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ తీరును ఎండట్టారు. రాత్రికి కుంగరెడ్డిపల్లి KR నగర్ కాలనీ విడిది కేంద్రంలో లోకేశ్ బస చేసి.. 12వ రోజు పాదయాత్రను అక్కడ నుంచే ప్రాంభిస్తారు.
ఇవీ చదవండి