ETV Bharat / state

'అందరూ రూల్‌ ఆఫ్‌ లా పాటించాలి'

న్యాయ వ్యవస్థ బలోపేతమైతే.. ప్రజాస్వామ్యం బలోపేతమైనట్లేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరూ రూల్‌ ఆఫ్‌ లా పాటించాలని ఆయన సూచించారు. చిత్తూరులో కోర్టు భవన సముదాయ నిర్మాణానికి శుక్రవారం డిజిటల్‌ విధానంలో శంకుస్థాపన చేశారు. ముఖ్య అతిథిగా దిల్లీ నుంచి పాల్గొన్న జస్టిస్‌ రమణ.. భూమిపూజ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ

author img

By

Published : May 30, 2020, 8:23 AM IST

చిత్తూరులో కోర్టు భవన సముదాయ నిర్మాణానికి డిజిటల్‌ విధానంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ శుక్రవారం శంకుస్థాపన చేశారు. దిల్లీ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, అమరావతి నుంచి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి, హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్ట్‌ఫోలియో న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రనాథరాయ్‌ ఆన్‌లైన్‌ ద్వారా పాల్గొని ప్రసంగించారు.

జస్టిస్‌ రమణ మాట్లాడుతూ.. ‘కరోనా కారణంగా ప్రస్తుతం కొంత కఠిన పరిస్థితుల్లో ఉన్నాం. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ముందడుగు వేయాల్సి ఉంది. కొన్నిచోట్ల ఇప్పటికీ బ్రిటీషు కాలంలో నిర్మించిన భవనాల్లోనే కోర్టుల కార్యకలాపాలు జరుగుతున్నాయి. అలాంటిచోట్ల నూతన కోర్టు భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. 2013 మే నెలలో నేను హై కోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలో విజయవాడ సిటీ సివిల్‌ కోర్టు నిర్మాణ పనులు ప్రారంభించాం. ఇప్పటికీ అక్కడ పనులు జరుగుతూనే ఉన్నాయి. చిత్తూరు కోర్టు భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి’ అని సూచించారు.

సత్వర న్యాయం జరగాలి: జస్టిస్‌ లావు నాగేశ్వరరావు

సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ‘దేశవ్యాప్తంగా ఉన్న పెండింగ్‌ కేసుల్లో 86 శాతం దిగువ కోర్టుల్లో ఉన్నాయి. అట్టడుగున ఉన్న వ్యక్తికి కూడా న్యాయం జరుగుతుందనే భరోసాను కోర్టులు ఇవ్వాలి. ఈ న్యాయమూ సత్వరమే జరగాలి’ అని అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏవీ రవీంద్రబాబు, మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎం.వెంకట హరినాథ్‌, న్యాయవాదుల క్రమశిక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నల్లారి ద్వారకానాథరెడ్డి, చిత్తూరు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మోహన్‌ రామిరెడ్డి, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

శీతలీకరణ ముందురోజే ఆపేశారు: ఎన్జీటీ కమిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.