చిత్తూరు జిల్లా పుత్తూరులో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీవారి గొడుగులు ఊరేగింపు కన్నులపండుగగా సాగింది. చెన్నైకి చెందిన విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏటా శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారికి గొడుగులు అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఆర్ డీఎం రైల్వే గేట్ నుంచి పుత్తూరు పురవీధులలో శ్రీవారి గొడుగులు ఊరేగింపు కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది. ఈ సందర్భంగా స్థానిక శివాలయానికి ద్రౌపదీ సమేత ధర్మరాజులు ఆలయానికి, సుబ్రహ్మణ్యేశ్వర ఆలయానికి గొడుగులను వితరణగా అందజేశారు. ఊరేగింపు కార్యక్రమం ముందు పండరి భజనలు వంటి కార్యక్రమాలతో ఆహ్లాదంగా కార్యక్రమం సాగింది ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు, పురప్రముఖులు భక్తులు పాల్గొన్నారు.
ఇదీచూడండి.శ్రీవారి గొడుగులకు ఘన స్వాగతం