అలిపిరి తనిఖీ కేంద్రంలో పాము భద్రతా సిబ్బందిని పరుగులు పెట్టించింది. అటవీ ప్రాంతం నుంచి తనిఖీ కేంద్రంలోకి వచ్చిన ఏడడుగుల పాము అక్కడే తిరుగుతూ భయాందోళనకు గురి చేసింది. పాములు పట్టే వ్యక్తి అక్కడికి చేరుకుని దానిని పట్టుకోవడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. కరోనా ప్రభావంతో భక్తుల రాక తగ్గి రహదారి నిర్మానుష్యంగా మారడంతో పాములు, అటవీ జంతువుల సంచారం ఎక్కువైంది.
ఇదీ చదవండి: కోర్టు ఆదేశాలతోనే పరిషత్ ఎన్నికలు నిర్వహించాం: చెవిరెడ్డి