రాష్ట్ర ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిని శబ్ధ కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి కోరారు. జూలై 2న నో హారన్ జోన్ పేరుతో.....తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న అవగాహన కార్యక్రమానికి సంబంధించి ప్రచార పత్రాలను ఆయన విడుదల చేశారు.
తిరుపతిలోని అలిపిరి మార్గం, తిరుమలను పూర్తి స్థాయిలో నో హారన్ జోన్ గా ప్రకటించామని ఎస్పీ రమేష్ రెడ్డి తెలిపారు. తితిదే ఉద్యోగులు, సాధారణ ప్రజలు, భక్తులు సహా ప్రతి ఒక్కరూ తమ వాహనాల హారన్ ను వినియోగించరాదని కోరారు. కేవలం అత్యవసర వాహన సేవలకు మాత్రం వీటి నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. ఎస్పీ.... ఆదేశాల ఉల్లంఘనకు పాల్పడితే జరిమానాలు విధిస్తామన్నారు.
ఇదీ చూడండి: ప్రభుత్వం వైద్యుల సమస్యలు పరిష్కరించాలి: నారా లోకేష్