Lorry Accident : చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి మండలం భాకరాపేట కనుమదారిలో రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి- అనంతపురం జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. హోసూర్ నుంచి స్కూటర్ విడివిభాగాలను చెన్నైకు రవాణా చేస్తున్న లారీ.. అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో వాహన డ్రైవర్ క్యాబిన్లో చిక్కుకున్నాడు.
సమాచారం అందుకున్న చంద్రగిరి పోలీసులు...సంఘటన స్థలానికి చేరుకున్నారు. లారీ క్యాబిన్లో చిక్కుకున్న డ్రైవర్ను బయటకు తీశారు. వైద్య చికిత్స నిమిత్తం 108లో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని సీఐ శ్రీనివాసులు ప్రాథమిక విచారణలో తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఇదీచదవండి.