చిత్తూరు జిల్లాలోని రేణిగుంట-నాయుడుపేట ఆరు వరుసల రహదారి భూసేకరణ పనులకు... సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. చిత్తూరు -సి.మల్లవరం ఆరు వరుసల రహదారి పనులు వేగవంతంగా జరుగుతుండగా... ఈ మార్గంలో మాత్రం భూసేకరణ దశలోనే ప్రక్రియ నిలిచిపోయింది. రేణిగుంట-నాయుడుపేట మార్గంలోని 57 కిలోమీటర్ల పరిధిలో ఆరు వరుసల రహదారి నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. దీనికి రూ.1457 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.
భూ పరిహారం చెల్లించేందుకు.. ఇటీవల కేంద్రం రూ.58 కోట్లు విడుదల చేసింది. వాస్తవానికి భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత అమ్మకాలు చేయకూడదు. కొందరు లబ్ధిదారులు అనధికారికంగా తమ భూములను ఇతరులకు విక్రయించారు. దీంతో రికార్డుల్లో ఒకరి పేరు ఉండగా క్షేత్రస్థాయిలో పరిహారం చెల్లించేప్పుడు లబ్ధిదారుల పేరు మరొకరిది ఉంటోంది. ఇలా సుమారు 126 ఎకరాలకు సంబంధించి చేతులు మారినట్లు అధికారుల పరిశీలనలో తేలింది.
భూ పరిహారానికి సంబంధించి మిగిలిన అభ్యంతరాలను పరిశీలించి.. త్వరలోనే లబ్ధిదారులకు పరిహారం చెల్లిస్తామని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ప్రజల ఆకాంక్షలు నీరుగార్చడం ప్రజాద్రోహం : చంద్రబాబు