చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం పాతపాళెం ఎస్సీ కాలనీకి చెందిన తిరుమలయ్య (26) 4 రోజుల క్రితం కుటుంబ సభ్యులతో గొడవపడి వెళ్ళిపోయాడు. ఆదివారం సాయంత్రం రాజుల చెరువు సమీపంలోగల వ్యవసాయ బావిలో పశువుల కాపరులు ఓ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
ఇవాళ ఉదయం గ్రామస్తుల సాయంతో బావిలోని మృతి దేహాన్ని తీసిన పోలీసులు చుట్టుపక్కల వారిని విచారించారు. మృతుడు పాత పాలెం ఎస్సీ కాలనీకి చెందిన తిరుమలయ్యగా గుర్తించారు. 4 రోజుల క్రితం గొడవపడి వెళ్ళిన తిరుమలయ్య బావిలో శవమై తేలడం, మృతదేహం నడుముకు దారం ఉన్న కారణంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తిరుమలయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: