Dharna against illegal cases: చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం 89 పెద్దూరు టీడీపీ వార్డు సభ్యుడు ఏలుమలై మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ భార్య పవిత్ర, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. నిందితులను పోలీసులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనకు దిగిన తనపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమంగా కేసులు పెట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కుప్పం ఆర్డీఓ కార్యాలయం ముందు బైఠాయించి నినాదాలు చేశారు.
ఇవీ చదవండి: