ETV Bharat / state

తిరుపతిలో నోటికి నల్ల బ్యాడ్జీలతో భాజపా ఆందోళన - undefined

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి భయపెడుతుంటే రాష్ట్రంలో దాని ప్రభావం లేదని సీఎస్​తో ఎన్నికల సంఘానికి లేఖ రాయించటం దారుణమని భాజపా రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాష్​రెడ్డి అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నోటికి నల్లబ్యాడ్జీలు కట్టుకుని భాజపా నాయకులు ఆందోళన చేసారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్నికల సంఘానికి రాసిన లేఖలను దగ్ధం చేశారు. నగర పాలక సంస్థ కమిషనర్ పీఎస్ గిరిషాని కలిసి వినతిపత్రం అందించారు. స్థానిక సంస్థలకు ఎన్నికలకు సంబంధించి తిరిగి నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. రాజ్యాంగ బద్ధమైన సంస్థల విచక్షణాధికారాలు తెలియకుండా సీఎం జగన్​ అజ్ఞానంతో మాట్లాడుతున్నారన్నారు. తక్షణమే రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని నిరోధించేలా చర్యలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

BJP agitation at Tirupathi with black badges to tie mouth
తిరుపతిలో నోటికి నల్ల బ్యాడ్జీలతో భాజపా ఆందోళన
author img

By

Published : Mar 16, 2020, 3:09 PM IST

.

తిరుపతిలో నోటికి నల్ల బ్యాడ్జీలతో భాజపా ఆందోళన

ఇదీ చదవండి : 'శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎన్నికలు పూర్తిగా రద్దు చేయండి'

.

తిరుపతిలో నోటికి నల్ల బ్యాడ్జీలతో భాజపా ఆందోళన

ఇదీ చదవండి : 'శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎన్నికలు పూర్తిగా రద్దు చేయండి'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.