అమరావతిలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి జీకే. ద్వివేది మీడియా సమావేశం నిర్వహించారు. గురువారం జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఇవాళ, రేపు కోడ్ అమలులో ఉంటుందన్నారు. నియోజకవర్గాల్లో బయటివారికి అనుమతి లేదని స్పష్టం చేశారు.తనీఖీల్లో ఇప్పటివరకు 196.03 కోట్ల నగదును స్వాధీనం చేసుకొన్నామని పేర్కొన్నారు. సీ-విజిల్ యాప్లో 5,679 ఫిర్యాదులు నమోదయ్యాయన్నారు. ఎక్కువగా తప్పుడు కేసులు వచ్చాయని పేర్కొన్నారు. కాగా పెండింగ్ 26 కేసులు మాత్రమే ఉన్నట్లు స్పష్టం చేశారు. ఏజెంట్లుగా వ్యవహరించేవారు ఉదయం 6 గంటలకే పోలింగ్ కేంద్రాలకు రావాలని సూచించారు. పోలింగ్ సన్నాహకాలు గంటముందే ప్రారంభమవుతాయన్నారు. అంధుల కోసం బ్రెయిలీ లిపిలో బ్యాలెట్ పేపర్ అందుబాటులో ఉంచామన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే... ఈసారి పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
ఇదీ చదవండి