ఆంధ్రప్రదేశ్లోని అన్ని వ్యవసాయ మార్కెట్లలో ఈనాం విధానం అమలు చేయాల్సిందేనని కమిషనర్ ప్రద్యుమ్న స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మార్కెటింగ్ శాఖ అధికారులతో గుంటూరులోని ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈనాం విధానం అమలును వ్యాపారులు, ఎగుమతిదారులు వ్యతిరేకిస్తున్న విషయాన్ని అధికారులు కమిషనర్ దృష్టికి తెచ్చారు. పంట ఉత్పత్తులు కొనేందుకు నిరాకరిస్తున్నట్లు తెలిపారు. స్థానికంగా ప్రజాప్రతినిధుల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు తెలిపారు.
రైతులకు ఖచ్ఛితమైన ధరతో పాటు పంట కొనుగోళ్లు సక్రమంగా జరగటం, పన్నులు సజావుగా వసూలు చేయటం కోసం ఉద్దేశించిన ఈనాం విధానాన్ని తెచ్చామని... దాన్ని అమలు చేసేందుకు అంతా కలిసి రావాలని కమిషనర్ సూచించారు. కొందరు అధికారులు వ్యాపారులకు వత్తాసు పలుకుతున్నట్లుందని అనుమానం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి