రాష్ట్రంలో చాలా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి విపరీతంగా ఉందని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. ఈ నెల 25 న అన్ని కలెక్టరేట్లలో ఈ సమస్యపై మెమోరాండం ఇస్తామని తెలిపారు. ఎన్నికల్లో ప్రధాన పార్టీలు విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టారని ఆరోపించారు. భీమవరంలో పవన్ను ఓడించడానికి ఒక్కో ఓటుకు 3 వేలు పంపిణీ చేశారని విమర్శించారు. డబ్బున్న వారే ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి వచ్చిందన్నారు.
ముఖ్యమంత్రి రివ్యూ చేయకూదని ఈసీ మాట్లాడుతోందని... డబ్బు పంపిణీ జరిగిన విషయం ఈసీకి కనపడట్లేదా అని రామకృష్ణ మండిపడ్డారు. జగన్కు తెలంగాణ సీఎం ఆరు వందల కోట్లిచ్చారన్నారు. డబ్బు దొరికిన ప్రతి నియోజకవర్గంలో ఉపఎన్నిక జరపాలని కోరారు. ఉపఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
ఇదీ చదవండి