రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో చర్చించాల్సిన అంశాలను ముఖ్యమంత్రి కార్యాలయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపింది. ఫోని తుపాను ప్రభావంతో పాటు సహాయ పునరావాస కార్యక్రమాలు, రాష్ట్రంలో తాగు నీటి ఎద్దడి, రాష్ట్రంలో కరవు పరిస్థితులు, గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలకు చెల్లింపుల్లో వచ్చిన అడ్డంకులతో పాటు నిరుద్యోగిత తదితర అంశాలపై చర్చిస్తామని నోట్ పంపించింది. 48 గంటల ముందుగా దీన్ని ఎన్నికల సంఘానికి అనుమతి కోసం పంపాల్సి ఉండటంతో క్యాబినెట్ సమావేశం వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 14 తేదీన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎంఓ కార్యాలయం నోట్ లో పేర్కొంది. సమావేశానికి సంబంధిత శాఖలకు చెందిన అధికారులంతా హాజరయ్యేలా చూడాలని సీఎస్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఇదీచదవండి