ETV Bharat / state

'గెలిచేది మేమే... దేశం కోసమే నా పోరాటం'

దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో సమావేశమైన ప్రతిపక్షాలు.... ఈవీఎంల పనితీరు, ఎన్నికల సంఘం ధోరణిపై చర్చించారు. 50 శాతం వీవీప్యాట్‌లను లెక్కించాల్సిందేనని డిమాండ్ చేసిన భాజపాయేతర పక్షాలు... సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని నిర్ణయించారు. ఏపీలో ఎన్నికలు పూర్తైనా... దేశం కోసం పోరుబాట పట్టానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

ఈసీ ఓటర్ల విశ్వాసం కోల్పోయింది: చంద్రబాబు
author img

By

Published : Apr 14, 2019, 2:00 PM IST

Updated : Apr 14, 2019, 7:41 PM IST

ఎన్నికల సంఘం తీరు అనుమానంగా ఉందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. దిల్లీలోని కాన్​స్టిట్యూషన్ క్లబ్​లో ప్రతిపక్షాల సమావేశానికి హాజరైన ఆయన... ఈవీఎంలో లోపాలు, ఎన్నికల సంఘం తీరుపై ధ్వజమెత్తారు. తెలంగాణలో సాంకేతికతను దుర్వినియోగం చేసి... 25 లక్షల ఓట్లు తొలగించారని దుయ్యబట్టారు. తర్వాత క్షమాపణలు చెప్పి తప్పించుకున్నారని విమర్శించారు. ఏ పార్టీలకు తెలియకుండానే ఒప్పంద సిబ్బందికి ఈవీఎంల నిర్వహణ అప్పగించడమేంటని చంద్రబాబు ప్రశ్నించారు. ఏదైనా జరిగితే బాధ్యత వహిస్తారా అని ఈసీని నిలదీశారు. అందుకే నమ్మకమైన బ్యాలెట్ ఉపయోగించి ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.

దేశం కోసం నా పోరాటం...
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు పూర్తయ్యాయని... ఇప్పుడు దేశం కోసమే తన పోరాటమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత ఉండాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరారు. రకరకాల మార్గాల్లో ఈవీఎంలను ప్రభావితం చేయవచ్చని... అందుకే ప్రపంచంలో చాలా దేశాలు ఈవీఎంలు వాడటం లేదని గుర్తు చేశారు. ఏపీలో 20 నుంచి 30 శాతం ఈవీఎంలు పనిచేయలేదని... ఈసీ తీరుపై మహిళలు నిరసన వ్యక్తం చేసిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు.

విజయం మాదే...

విజయం మాదే:చంద్రబాబు

ఏపీ ఎన్నికల్లో వంద శాతం తప్పక విజయం సాధిస్తామని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఓటర్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారనేదే తమ అభ్యంతరమని చంద్రబాబు తేల్చి చెప్పారు.

50 శాతం వీవీ ప్యాట్లు లెక్కించాల్సిందే...

50 శాతం వీవీప్యాట్స్ స్లిప్పులు లెక్కించాలి:చంద్రబాబు

ఎన్నికల సంఘం విశ్వాసం కోల్పోయిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. 22 రాజకీయ పార్టీలు పేపర్ బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరగాలని కోరామన్నారు. కనీసం 50 శాతం వీవీ ప్యాట్స్ లెక్కించి ఫలితాలు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు.

తెలంగాణలో ఓట్లు తొలగించారు..

తెలంగాణలో ఓట్లు తొలగించారు:చంద్రబాబు

తెలంగాణలో సాంకేతికత దుర్వినియోగంతో 25 లక్షల ఓట్లు తొలగించారని చంద్రబాబు ఆరోపించారు. ఎన్నికల నిర్వహణ తర్వాత అధికారులు క్షమాపణ చెప్పారని గుర్తు చేశారు.

అధికార పక్షంపై ఈసీ మాటేంటి..?

రాజ్యాంగ బద్ధ సంస్థలను వాడుకుంటోంది:చంద్రబాబు
ఎన్నికల వేళ విపక్ష పార్టీలపై అధికార పక్షం దాడులు చేయించిందని చంద్రబాబు దుయ్యబట్టారు. సీబీఐ,ఈడీ, ఆదాయపన్ను శాఖ ద్వారా నేతలపై దాడులకు పాల్పడినట్లు ఆరోపించారు. భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాలపై కన్నెత్తి చూడని ఎన్నికల సంఘం తమ సందేహాలకు ఏం సమాధానం చెబుతుందన్నారు చంద్రబాబు.

Firozabad (UP) Apr 14 (ANI): While speaking to ANI Pragatisheel Samajwadi Party (Lohia) PSP(L) president Shivpal Singh Yadav said, "This alliance is 'bemel gathbandhan' and it will never be successful. No one will trust Mayawati ji tickets are being given after taking money. Where does this money come from? Nobody can trust her. Who knows where she will go after elections. She will go wherever she gets power."
Last Updated : Apr 14, 2019, 7:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.