మలుపులు తిరుగుతూ వస్తోన్న విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు ఎట్టకేలకు సవివర నివేదిక ముసాయిదా(డీపీఆర్) సిద్ధమైంది. ఫ్రాన్స్‌కు చెందిన సిస్ట్రా, భారత్‌కు చెందిన రైట్స్ సంస్థలు డీపీఆర్ తయారు చేశాయి. ఈ నివేదికపై సూచనలు, అభ్యంతరాలు అమరావతి మెట్రో రైలు సంస్థ తెలియజేయాల్సి ఉంది. ఈ నెలాఖరుకు లైట్ మెట్రో డీపీఆర్ ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది.
విజయవాడ, అమరావతితో కలిపి మొత్తం 85 కిలోమీటర్ల దూరం లైట్‌మెట్రో నిర్మాణం చేయాలని నిర్ణయించారు. దీనికోసం సూమారు 17,500 కోట్లు పైగా ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ మొత్తం రుణం ఇవ్వడానికి ఫ్రాన్స్, జర్మనీకి చెందిన ఐఎఫ్డీ, కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంకులు ఒప్పుకున్నాయి.
జర్మనీకి చెందిన మెట్రో నిపుణులతో కూడిన డాట్సన్ బృందం ప్రాథమిక నివేదిక అందించి తేలికపాటి మెట్రో అనువైందని తేల్చింది. దాదాపు ఏడాది తర్వాత ముసాయిదా నివేదిక సిద్ధమైంది. విజయవాడ, అమరావతి తేలికపాటి మెట్రోకు కిలోమీటరు వ్యయం 200 కోట్లు అవుతుందని తెలిపారు. భూగర్భంలో కిలోమీటరు వ్యయం రూ.400 కోట్లవుతుందని వెల్లడించారు. లైట్‌మెట్రో ఆకాశంలో, నేలమీద, భూగర్భంలో నిర్మించనున్నారు. తొలిదశలో విజయవాడ నగరంలో రెండు కారిడార్లు నిర్మాణం చేయాలని ప్రతిపాదించారు. రెండో దశలో అమరావతి కారిడార్ నిర్మాణం చేయాలని నిర్ణయించారు. జక్కంపూడి కారిడార్ నిర్మాణాన్ని ప్రభుత్వ నిర్ణయానికి వదిలేశారు. మరో నెల రోజుల్లో విజయవాడ మెట్రో డీపీఆర్ ఆమోదం పొంది టెండర్లను పిలవనున్నట్లు అమరావతి మెట్రో రైలు సంస్థ ఉన్నతాధికారులు వెల్లడించారు.
అమరావతి మెట్రోకు డీపీఆర్ రెడీ
విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు ఎట్టకేలకు సవివర నివేదిక ముసాయిదా(డీపీఆర్) సిద్ధమైంది. ఫ్రాన్స్‌కు చెందిన సిస్ట్రా, భారత్‌కు చెందిన రైట్స్ సంస్థలు డీపీఆర్ తయారు చేశాయి. ఈ నివేదికపై సూచనలు, అభ్యంతరాలు అమరావతి మెట్రో రైలు సంస్థ తెలియజేయాల్సి ఉంది.