అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో మాజీమంత్రి రఘువీరారెడ్డి ఆయన సతీమణితో కలిసి దేవాలయాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండో రోజైన నేడు 1200 సంవత్సరాల చరిత్రకలిగిన మునీశ్వరస్వామి దేవాలయం వద్ద ప్రత్యేకహోమాలు, పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించి, కలశస్థాపన చేసి అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత లింగప్రాణ ప్రతిష్ట చేసి కుంభాభిషేకం నిర్వహించి పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం, మహా మంగళ హారతి చేపట్టారు.
శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయంలో యథావిధిగ హోమాలు, పూర్ణాహుతి నిర్వహించి ఆలయంలో ప్రతిష్టించిన ప్రసన్న ఆంజనేయస్వామికి కళశాభిషేకం, కుంభాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి పంచామృతాభిషేకం చేసి ప్రత్యేకంగా పూలతో అలంకరించి పూజలు, మహా మంగళ హారతి నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.
ఇదీ చదవండీ... RRR LETTER: అమరావతిపై సరైన దృక్పథంతో ఆలోచించండి.. సీఎం సార్: రఘురామ