ETV Bharat / state

అంబులెన్స్ సిబ్బంది అమానుషం... ఇంటి ముందే కరోనా రోగి మృతదేహం

కరోనాతో ఓ వృద్ధుడు మృతి చెందటంతో..ఆ మృతదేహాన్ని ఎవరికీ చెప్పకుండా ఆ వ్యక్తి ఇంటి ముందు వదిలేసి వెళ్లిపోయారు ప్రైవేటు అంబులెన్స్ సిబ్బంది. ఈ ఘటన అనంతపురం జిల్లా లేపాక్షిలో చోటుచేసుకుంది.

The corpse of a man with a corona in a miserable condition
లేపాక్షిలో దారుణం
author img

By

Published : Sep 4, 2020, 1:06 PM IST

అనంతపురం జిల్లా లేపాక్షిలో కరోనా లక్షణాలతో దయనీయ స్థితిలో 74 సంవత్సరాల వయసు గల అనంతరావు అనే వృద్ధుడు అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అయితే ప్రైవేటు అంబులెన్స్ సిబ్బంది మృతదేహాన్ని ఆ వ్యక్తి ఇంటి ముందు వదిలేసి బంధువులకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు. కుటుంబసభ్యులు పట్టించుకోకపోవటంతో.... చాలా సేపటి వరకు మృతదేహం ఇంటి ముందే ఉంది. దీంతో స్థానికులు ఆందోళన చెందారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ బలరాం అక్కడికి చేరుకుని మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించారు.

ఇదీ చదవండి: టిక్​టాక్​తో ఒక్కటయ్యారు.. ఒక్కటిగా తనువు చాలించారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.