విశాఖలో తెదేపా అధినేత చంద్రబాబుతో పోలీసులు వ్యవహరించిన తీరుపై తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఇన్ని రోజులు సేవలు చేసిన తెదేపా అధినేతను విశాఖలోనికి రానివ్వమంటూ కొంతమంది అడ్డుకోవటాన్ని ఖండించారు. రాజధానిపై జరుగుతున్న దోపిడీని చంద్రబాబు ఎక్కడ బయట పెడతారన్న ఆందోళనతోనే వైకాపా ఇలాంటి ఘటనలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, పల్లె రఘునాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. వెంటనే వైకాపా ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి, జగన్ పాదయాత్ర చేసిన సమయంలో ఇలా ఎప్పుడైనా జరిగిందా అని పల్లె రఘునాథ్ రెడ్డి ప్రశ్నించారు. పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదని తెదేపా సీనియర్ నేత వర్లరామయ్య, ఎమ్మెల్సీ అశోక్ బాబు, అమర్ నాథ్ రెడ్డి, జవహర్ తెలిపారు.
ఇవీ చదవండి: