ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులను ఆపాలని అనంతపురం జిల్లా పెనుకొండలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట సిపిఎం, సిఐటియు, కెవిపిఎస్ నాయకులు ప్లకార్డులతో నిరసన చేశారు. దాడులకు పాల్పడిన వారిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్ డిమాండ్ చేశారు. అధికారులు, పాలకులు ఎస్సీలపై దాడులకు పాల్పడుతున్న వారిపై వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు హరి తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి : 'ప్రజాస్వామ్య హక్కులకు కేంద్రం భంగం కలిగిస్తోంది'