ఓ పక్క లాక్డౌన్ పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నా... కొందరు పట్టనట్టే ఉంటున్నారు. భౌతిక దూరం పాటించాలంటూ సూచిస్తున్నా..పట్టించుకోవడం లేదు. దీనికి ఉదాహరణే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లి గ్రామంలో జరిగిన ఘటన.
కుర్లపల్లి గ్రామంలో కొంతమంది జూదం ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం రావటంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఏడుగుర్ని అదుపులోకి తీసుకొని 5వేల 130 రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కళ్యాణదుర్గం రూరల్ ఎస్సై సుధార్ వివరించారు.
ఇదీ చదవండి: అనంతలో కరోనా నివారణ చర్యలు ముమ్మరం