నకిలీ సర్టిఫికెట్స్ తయారీదారుడు గ్లెన్బ్రిగ్స్ ఇంట్లో పోలీసుల సోదాలు కొనసాగుతున్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని నిందితుడి నివాసంలో డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బృందాలు సోదాలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో వివిధ విశ్వ విద్యాలయాలకు చెందిన నకిలీ ధ్రువపత్రాలు, వాటర్ మార్కు పెన్నులుతో పాటు, విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సర్టిఫికెట్స్ ఎవరి కోసం తయారు చేశారు, ఏ విద్యా శాఖకు సంబంధించినవి, అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఎవరైనా నకిలీ ధ్రువపత్రాలతో విధులు నిర్వర్తిస్తున్నారా.. అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికైనా పోలీసులు దీనిపై సమగ్ర విచారణ చేపట్టి.. తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. గత వారం రోజుల కిందట నకిలీ సర్టిఫికెట్స్కు సంబంధించి నిందితుడు గ్లెన్బ్రిగ్స్ను అరెస్టు చేశారు. అయితే మరింత సమాచారం కోసం పోలీసులు మరోసారి దాడులు నిర్వహించారు.
ఇవీ చూడండి: