అనంతపురం జిల్లా పామిడి మండలం కండ్లపల్లి గ్రామ శివారులోని పంట పొలాల్లో.. చిరుతల సంచారంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు.. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడకు చేరుకుని.. పంటపొలాల్లో చిరుత పులి కాలి అడుగులను గుర్తించారు. రెండు చిరుతలు సంచరిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్థులు, గొర్రెల కాపరులు.. ఒంటరిగా పొలాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చిరుత పులి కనబడితే తమకు సమాచారం అందించాలని అధికారులు గ్రామస్థులకు తెలిపారు.
ఇదీ చదవండి:
ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి చేదు అనుభవం.. ధాన్యం సొమ్ము కోసం నిలదీసిన రైతులు