అనంతపురం జిల్లా తలుపుల మండలం కుటాగుళ్ల గ్రామాల్లో వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు పర్యటించారు. వ్యవసాయ శాఖ డీఆర్సీపీడీ మద్దిలేటి , ఏడీఏ పద్మాలత, ఏవో శేఖర్ రెడ్డి , శాస్త్రవేత్త వెంకట రమణ పంట పొలాలను పరిశీలించారు. చాలా ప్రాంతాల్లో వేరుశనగ పంటకు తెగుళ్లు వ్యాపిస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం రైతు భరోసా కేంద్రంలో రైతులకు ఎరువులను ఎలా బుక్ చేసుకోవాలి, డిజిటల్ చెల్లింపులపై అవగాహన కల్పించారు.
ఇదీ చదవండి: కుక్కల బాధ భరించలేక పోలీస్స్టేషన్ మెట్లెక్కిన మహిళలు