ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరిస్తోందని భాజపా నేత విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఎన్వైకే జాతీయ ఉపాధ్యక్షుడు హోదాలో ఉన్న తనకు విపత్కర పరిస్థితుల్లో సలహాలు, సూచనలిచ్చే అధికారం తనకుందన్నారు. ఆ హోదాతోనే కర్నూలు మీడియా సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ హోదాలో ఉన్న తనకు నోటీసులిచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. జిల్లాలో పర్యటించిన బొత్స సత్యనారాయణకు, రాజేంద్రనాథ్ రెడ్డికి నోటీసులిచ్చారా అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని అందరి సహకారంతో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు సమష్టిగా కృషి చేయాలని సూచించారు.
ఇదీ చదవండి: జియోకు అమెజాన్ పోటీ- కిరాణా సరకుల కోసం కొత్త యాప్