పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అనంతపురం, హిందూపురంలలో ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఈద్గా మైదానం నుంచి ప్రారంభమైన ర్యాలీ... సధ్భావన సర్కిల్, అంబేద్కర్ సర్కిల్ మీదుగా పట్టణం ప్రధాన వీధులలో కొనసాగింది. నల్లబ్యాడ్జీలు ధరించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి