అనంతపురం జిల్లా లేపాక్షి ఆలయం గురించి తెలియని వారుండరు. అపురూపమైన శిల్పకళా సంపదను, శ్రీకృష్ణ దేవరాయల పాలనా వైభవాన్ని నవతరానికి పరిచయం చేయనున్నారు. ఏటా ప్రభుత్వం నిర్వహిస్తున్న లేపాక్షి ఉత్సవాల తరహాలోనే ఈసారి కూడా నేటి నుంటి రెండు రోజులపాటు లేపాక్షి వైభవం పేరుతో ప్రభుత్వం ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఇందుకోసం లేపాక్షి మండల కేంద్రంతోపాటు, ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు.
లేపాక్షి వైభవం చూసేందుకు రెండు లక్షల మంది సందర్శకులు, భక్తులు వస్తారని జిల్లా అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. ఇందుకు తగినట్లుగా తాగునీరు, ఆహార విక్రయశాలలు ఏర్పాటు చేయిస్తున్నారు. అయితే ఈ ఉత్సవాలకు నిధుల కొరత వేదిస్తున్నట్లు వివిధ శాఖల అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టి తీసుకొచ్చారు. గత ఏడాది నాలుగు కోట్ల రూపాయలు ఈ ఉత్సవాల కోసం ఖర్చు చేయగా, దానికి సంబంధించిన బిల్లులు మంజూరు కాలేదు. ఈసారి ఉత్సవాలకు కోటి రూపాయలను కేటాయించినప్పటికీ, నిధులు విడుదల కాలేదు. దీనివల్ల అందుబాటులో ఉన్న వనరులతోనే అధికారులు ఏర్పాట్లు చేశారు