అనంతపురం జిల్లా కదిరిలో భారీ వర్షం కురిసింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు ఓ మోస్తరు వర్షం మాత్రమే కురిసింది. గంటపాటు కురిసిన వర్షానికి వాగులు, వంకలు పరవళ్లు తొక్కాయి. కదిరికి సమీపంలోని పెనుకొండరాయుని చెరువు మరువవంక వర్షపునీటితో పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. కదిరి మండలం పరిధిలోని వరిగిరెడ్డి పల్లి సమీపంలోని కట్టెలతండాకు వెళ్లే మార్గంలో వంక పరవళ్లు తొక్కుతూ ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది.
వాగు దాటడానికి తండావాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కదిరి పట్టణానికి సమీపంలోని గృహనిర్మాణ శాఖ కార్యాలయం వర్షపునీటితో మడుగును తలపించింది. కార్యాలయ ఉద్యోగులు, పనుల నిమిత్తం వచ్చిన వారు వాగును దాటడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కార్యాలయ ఆవరణలో నిలిపి ఉంచిన వాహనాలు నీటిలో సగం వరకు మునిగిపోయాయి. భారీ వర్షం కురియడంతో వరినార్లు పోసుకున్న రైతులు హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి ఎస్సీ,ఎస్టీలపై దాడులు ఆపాలని నిరసన