ETV Bharat / state

వర్షాల కోసం శ్రీరామ భక్త మండలి 15 కి.మీ పాదయాత్ర

author img

By

Published : Mar 2, 2020, 12:54 PM IST

రాబోయే కాలంలో వర్షాలు పుష్కలంగా పడాలని కోరుకుంటూ శ్రీ రామ భక్త మండలి ఆధ్వర్యంలో పలువురు భక్తులు పాదయాత్ర చేపట్టారు. అనంతపురం జిల్లా రొద్దం నుంచి కర్ణాటకలోని పావుగడ శనీశ్వరుని దేవాలయం వరకు నడిచి.. స్వామిని దర్శించుకున్నారు.

god ram devoties foot march for rains in rodham at ananthapuram
వర్షాలు పడాలంటూ 15 కి.మి. పాదయాత్ర
వర్షాల కోసం శ్రీరామ భక్త మండలి 15 కి.మీ పాదయాత్ర

అనంతపురం జిల్లా రొద్దం మండలంలో శ్రీ రామ భక్త మండలి ఆధ్వర్యంలో పలువురు భక్తులు పాదయాత్ర చేపట్టారు. రొద్దం నుంచి కర్ణాటకలోని పావుగడ శనీశ్వరుని దేవాలయానికి కాలినడకన బయల్దేరారు. సీతారాములు, ఆంజనేయస్వామి చిత్రపటాలను చేతపట్టుకుని జై శ్రీరామ్ నినాదాలతో పాదయాత్ర చేశారు. 15 కిలోమీటర్లు నడిచి స్వామివారిని దర్శించుకున్నారు. శనీశ్వరుడు ధను రాశి నుంచి మకర రాశిలో అడుగుపెడుతున్న సందర్భంగా రాబోయే రెండున్నర సంవత్సరాల పాటు భక్తులను కాపాడాలని కోరుతూ.. మొక్కులు చెల్లించుకున్నామని రామ భక్త మండలి సభ్యులు తెలిపారు.

ఇదీ చదవండి: ఆవుకు సమాధి... 22 ఏళ్లుగా పూజలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.