అనంతపురం జిల్లా చౌటిపల్లి వద్ద... రమేష్ అనే వ్యక్తి తన నాలుగేళ్ల కుమారుడు దీక్షిత్‌తో కలిసి ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్నాడు. చింతపండు లోడ్‌తో అటుగా వస్తున్న టాటా ఏస్ వాహనం వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఘటనలో దీక్షిత్ మృతి చెందగా తండ్రి రమేష్‌కు గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి... రమేష్‌ను ఆసుపత్రికి తరలించారు. బాలుడి మృతితో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.
ఇదీ చదవండి: