అనంతపురం జిల్లా నుంచి కర్ణాటకకు వెళ్లే సరిహద్దులో పెద్దఎత్తున సరుకు రవాణా వాహనాలు నిలిచిపోయాయి. రాష్ట్ర సరిహద్దులోకి నిత్యావసర సరుకుల వాహనాలు తప్ప ఏ ఇతర వాహనాలు అనుమతించకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీంతో అన్ని వాహనాలను నిలిపివేశారు. కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చే వాహనాలను 44వ నెంబర్ జాతీయ రహదారిపై కొడికొండ చెక్ పోస్టు వద్ద ఆపివేశారు. దీంతో కిలోమీటర్ల మేర సరుకు రవాణా వాహనాలు పెద్దఎత్తున నిలిచిపోయాయి. సరుకు రవాణా చేస్తున్న లారీలను, అంబులెన్సులను మన రాష్ట్రం నుంచి కర్ణాటకలోకి వైరస్ పరీక్షల అనంతరం ఎలాంటి అభ్యంతరాలు లేకుండా అనుమతిస్తున్నారు. నిత్యావసర సరుకులు రవాణా చేస్తున్న వాహన డ్రైవర్లకు పరీక్షలు నిర్వహిస్తామని, మధ్యాహ్నానికి పరికరాలు సరిహద్దుకు చేరుకుంటాయని అనంతపురం జిల్లా డీటీసీ ప్రసాద్ తెలిపారు.
అత్యవసర సరుకుల రవాణా వాహనాల నిలిపివేత - అనంతపురంలో అత్యవసర సరుకుల రవాణా వాహనాలు నిలిపివేత
అత్యవసర సరుకులు రవాణా చేస్తున్న వాహనాలను అనంతపురం నుంచి కర్ణాటకకు వెళ్లే రహదారిలో నిలిపివేశారు. లారీ డ్రైవర్లకు కరోనా వైరస్ పరీక్షల అనంతరం వాహనాలను కర్ణాటకకు అనుమతించనున్నట్లు అనంతపురం జిల్లా డీటీసీ ప్రసాద్ తెలిపారు.

అనంతపురం జిల్లా నుంచి కర్ణాటకకు వెళ్లే సరిహద్దులో పెద్దఎత్తున సరుకు రవాణా వాహనాలు నిలిచిపోయాయి. రాష్ట్ర సరిహద్దులోకి నిత్యావసర సరుకుల వాహనాలు తప్ప ఏ ఇతర వాహనాలు అనుమతించకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీంతో అన్ని వాహనాలను నిలిపివేశారు. కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చే వాహనాలను 44వ నెంబర్ జాతీయ రహదారిపై కొడికొండ చెక్ పోస్టు వద్ద ఆపివేశారు. దీంతో కిలోమీటర్ల మేర సరుకు రవాణా వాహనాలు పెద్దఎత్తున నిలిచిపోయాయి. సరుకు రవాణా చేస్తున్న లారీలను, అంబులెన్సులను మన రాష్ట్రం నుంచి కర్ణాటకలోకి వైరస్ పరీక్షల అనంతరం ఎలాంటి అభ్యంతరాలు లేకుండా అనుమతిస్తున్నారు. నిత్యావసర సరుకులు రవాణా చేస్తున్న వాహన డ్రైవర్లకు పరీక్షలు నిర్వహిస్తామని, మధ్యాహ్నానికి పరికరాలు సరిహద్దుకు చేరుకుంటాయని అనంతపురం జిల్లా డీటీసీ ప్రసాద్ తెలిపారు.
ఇదీ చదవండి: కరోనా ఉందన్నా.. పరీక్షలు నిర్వహించారు.. తీరా చూస్తే!