ETV Bharat / state

మొక్కుబడిగా వచ్చి.. నిమిషాల్లోనే తిరిగి వెళ్లారు

author img

By

Published : Nov 10, 2020, 12:47 PM IST

జిల్లాలో పంట నష్టం అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృందం పర్యాటనపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొక్కబడిగా వచ్చి కేవలం పది నిమిషాల్లోనే తిరిగి వెళ్లడంపై ఆవేదన చెందుతున్నారు. తమ గ్రామాలకు వస్తామని చెప్పి కేంద్ర బృందం రాలేదంటూ పంట నష్టం తీవ్రతను కేంద్ర బృందానికి వివరించడంలో అధికారులు విఫలమయ్యారంటున్నారు.

Central team tour on crop loss
పంటనష్టంపై కేంద్ర బృందం పర్యాటన

ప్రణాళికలోనే లేదు..
కుండపోత వర్షాలతో సర్వస్వం కోల్పోయిన అనంతపురం జిల్లా రైతుల నష్టం.. కేంద్ర ప్రభుత్వ జాబితాలో చోటుకు నోచుకోని పరిస్థితి కనిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా పంట దిగుబడినే కాకుండా కనీసం పశుగ్రాసం కూడా దక్కించుకోలేని అనంత రైతుల వద్దకు వెళ్లాలనే ప్రణాళికే.. కేంద్ర బృందం షెడ్యూల్​లో లేదు. రాష్ట్రంలో కేవలం తూర్పుగోదావరి జిల్లాలో మాత్రమే నష్టం ఎక్కువగా జరిగినట్లు కేంద్రానికి ప్రతిపాదించిన అధికారులు.. అనంతపురంలో జరిగిన నష్టం తీవ్రతను చూపలేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే కేంద్ర బృందం జిల్లాకు రాకపోతే విమర్శలెదుర్కోవలసి వస్తుందని భావించిన ముఖ్యమంత్రి, కేంద్రాన్ని అభ్యర్థించి అనంతపురానికి రప్పించారు. కేవలం సీఎం చెప్పారు కాబట్టే.. కేంద్ర బృందం హెలీకాప్టర్​లో అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. కేవలం రెండు గ్రామాల్లో రెండు కమతాలను మాత్రమే పరిశీలించి, ఇద్దురు రైతులతో ఒక్కో నిమిషం చొప్పున మాట్లాడి పర్యటన ముగించారు.

ఆ నివేదిక అధారంగానే..
రాయలసీమ జిల్లాల్లో కరవుతోనో, అధిక వర్షాలతోనో పంట నష్టం జరిగినపుడు కేంద్ర బృందం పర్యటించి, జరిగిన నష్టాన్ని అంచనావేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తుంది. ఆ నివేదిక ఆధారంగానే కేంద్ర సర్కారు రాష్ట్రానికి పరిహారం నిమిత్తం నిధులు విడుదల చేస్తుంది. అయితే ఈసారి పర్యటన జరిగిన తీరు అందర్నీ ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. పంట నష్టం అంచనా వేయటానికి వచ్చిన బృందంలో కేంద్ర ప్రభుత్వ సివిల్ సర్వీస్ అధికారి ఒక్కరు కూడా లేకపోవటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పర్యటనకు వచ్చిన ఇంటర్ మినీస్టీరియల్ కేంద్ర బృందంలో ఆర్ బి కౌల్ ఆర్థికశాఖ కన్సల్టెంట్ కాగా, డా.కె.పొన్నుస్వామి వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు ఉన్నారు.

ఇలా వచ్చారు.. అలా వెళ్లారు..

సాధారణంగా ప్రకృతి వైపరీత్యాలతో నష్టాలు జరిగినపుడు క్షేత్రస్థాయిలో అంచనా వేయటానికి కేంద్ర ప్రభుత్వంలో, ఉన్నత హోదాలో పని చేసే ఐఏఎస్ అధికారులు వచ్చేవారు. దిల్లీ నుంచి బెంగుళూరుకు విమానంలో వచ్చి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పంటలను పరిశీలిస్తూ, రైతుల గోడు వింటూ.., ఒకటి, రెండు రోజులు పర్యటించేవారు. కాని ఈసారి ఆకాశ మార్గాన వచ్చిన బృందం, రైతులతో గడిపింది కేవలం పది నిమిషాలే. షెడ్యూల్ ప్రకారం కేంద్ర బృందం గుంతకల్లు మండలంలో పర్యటించకపోవటంతో ఆయా గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పంట నష్టం వివరాలన్నీ కేంద్ర బృందానికి సమర్పించామని జిల్లా కలెక్టర్ చెబుతున్నారు. భారీ వర్షాలతో వ్యవసాయ అనుబంధ రంగాలు, ప్రజల ఆస్తులకు మరో 150 కోట్ల రూపాయలు నష్టం జరిగిందని కలెక్టర్ గంధం చంద్రుడు కేంద్ర బృందానికి నివేదించారు.

ఇవీ చూడండి...

ప్రియుడి మోజు..కన్న కొడుకుపై తల్లి హత్యాయత్నం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.